Tollywood releases this week:
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు చిత్రాలు విడుదలయ్యాయి, వీటిలో మిస్టర్ బచ్చన్, తంగలాన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్ ఉన్నాయి. కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించి విజయవంతంగా నిలిచాయి కానీ మరికొన్ని చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఈ వారాంతంలో కూడా కొన్ని కొత్త Tollywood సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి, కానీ విడుదలకు ముందు వీటికి పెద్దగా హైప్ రావడం లేదని చెప్పాలి. ఆగస్ట్ 23న రావు రమేష్ నటించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం విడుదల కానుంది. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఇంద్రజ, అంకిత్ కోయ్య మరియు మరికొంత మంది ముఖ్య పాత్రల్లో నటించారు. ట్రైలర్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, విడుదలకు ముందు పెద్దగా చర్చ లేదు మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు.
మరో వైపు, సక్సెస్‌ఫుల్ హారర్ థ్రిల్లర్ డెమోంటీ కాలనీ బృందం, ఇప్పుడు రెండవ భాగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ ప్రియులు ఈ సినిమాను చూడచ్చు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా, ఆయన అభిమానులు ఇంద్ర, శంకర్ దాదా MBBS వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను తిరిగి థియేటర్లలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త విడుదలల కంటే ఈ సినిమాలకే ఎక్కువ హైప్ ఉంది.
OTT ప్లాట్‌ఫారమ్‌ల విషయానికి వస్తే, కల్కి 2898 AD హిందీ వెర్షన్ ఆగస్ట్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది, అదే రోజు అమేజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అవుతోంది. అలాగే, ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ ఆగస్ట్ 23 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అబిగైల్ అనే థ్రిల్లర్ 26 ఆగస్టు నుంచి జియో సినిమాల్లో అందుబాటులో ఉంటుంది. ఇన్‌కమింగ్ అనే టీనేజ్ డ్రామా 23 ఆగస్టు న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది.
ఏంగ్రీ యంగ్ మెన్ 20 ఆగస్టు న ప్రైమ్ వీడియోలో విడుదల అవ్వనుంది. ఇది ప్రముఖ రచయితలు సలీం, జావేద్ ల కథ. Grrr అనే మరో ఆసక్తికరమైన సినిమా 20 ఆగస్టు న డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇది మలయాళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది.