హీరోయిన్ హన్సిక సోషల్ మీడియాలో తన ఫొటోలు లీకైనా ఫర్వాలేదని అంటున్నారు. ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె వ్యక్తిగత ఫొటోలన్నీ బయటకు వచ్చాయి. అభిమానులు వెంటనే స్పందించి హన్సికకు, ఇన్‌స్టాగ్రామ్‌కు ట్యాగ్ చేయడంతో.. ఇన్‌స్టా వాటిని వెంటనే తొలగించింది. ఈ ఘటనపై తాజాగా హన్సిక స్పందిస్తూ.. ‘నాకు ఎవ్వరి దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నా కెరీర్లో భాగంగా ఎక్కువగా నా గురించి బయటకు చెప్పకొంది లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది నేను సామాజిక మాధ్యమాలను ఎలా అనుసరిస్తానో. నా వ్యక్తిత్వం అటువంటిది. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసమే నా ఫొటోలను కావాలని లీక్ చేయించానని అంటున్నవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు’
‘అలా మాట్లాడేవారిని చూస్తే నాకు జాలేస్తుంది. కొన్ని వారాల క్రితం నేను అమెరికా నుంచి రాగానే నా ఫోన్‌కు ఏదో సమస్య రావడం గమనించా. కానీ నాకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు లీకయ్యాయని తెలిసి షాకయ్యాను. ఆ ఫొటోలు నేను నాలుగేళ్ల క్రితం దిగినవి. వాటిలో కొన్ని హ్యాకర్లు మార్ఫ్ చేసినవి ఉన్నాయి. ఆ తర్వాత నా ట్విటర్ ఖాతా కూడా హ్యాకైందని తెలిసింది. గతంలో బికినీ వేసుకుని ఎన్నో ఫొటోషూట్స్ దిగాను. అలాంటి ఫొటోలు లీకైనా ఫర్వాలేదు’ అని వెల్లడించారు హన్సిక.