టాలీవుడ్లో నాని ‘జెంటిల్ మేన్’ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నటి నివేద థామస్. తొలి సినిమాతోనే విజయం సాధించాడు. ఆ తరువాత ‘నిన్నుకోరి’ , ‘జై లవ కుశ’ సినిమాలు కూడా ఆమెకి భారీ విజయాలను అందించాయి. 118, బ్రోచేవారెవరురా సినిమాలు కూడా ఆమె కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి. అలాంటి నివేద థామస్ దృష్టి డైరెక్షన్ పై ఉందట. మొదటి నుంచి కూడా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమనీ, అందువలన డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేశానని చెప్పింది. హీరోయిన్ గా కొంతకాలం చేసిన తరువాత, తాను మెగా ఫోన్ పడతానని అంది. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాననీ, ఆ తరువాతనే సినిమా వైపు వస్తానని చెప్పింది. దర్శకురాలిగా కూడా రాణించగలననే బలమైన నమ్మకమే ఉందని అంది.