సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవలే ఆమెని చిత్ర బృందం ఫైనల్ చేసింది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర కొత్తగా వుంటుందని తెలుస్తోంది. ఇటీవల సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా వుంటే ఈ సినిమా కోసం మరో హీరోయిన్‌ని చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తుంది. ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం నివేదా థామస్‌ని సంప్రదించారట. మహేష్ సినిమా కావడంతో నివేదా కూడా ఆసక్తిగా వుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మహేష్, దర్శకుడు పరశురామ్ అనుకుంటున్నారట.