HomeTelugu Trendingకిలిమంజారో ఎక్కిన టాలీవుడ్ బ్యూటీ

కిలిమంజారో ఎక్కిన టాలీవుడ్ బ్యూటీ

Nivetha thomas climb kilima

నటి నివేదా థామస్‌ అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను’ అంటూ ఆమె ఓ ఫొటో షేర్‌ చేశారు. చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్‌ అంటే ఇష్టం. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు.

19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతంపై ట్రెక్కింగ్‌ ఎంతో సాహసోపేతంతో కూడుకున్నది. ఇక ఈ బ్యూటీ ‘వకీల్‌సాబ్‌’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నివేదా పల్లవి అనే అమ్మాయి పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘మీట్‌ క్యూట్‌’ లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu