పవన్ కల్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ ను సిద్ధం చేసి ఎన్నికలు మొదలయ్యే లోపు వీలైనన్ని సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అలానే నేసన్ దర్శకత్వంలో
మరో సినిమా చేయనున్నారు.
నేసన్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమా చెల్లెలి సెంటిమెంట్ తో నడిచే కథ. దీంతో ఈ సినిమాలో పవన్ కు చెల్లెలు పాత్రలో మొదట చాలా మంది పేర్లు వినిపించాయి. నటి ఆనందిని ఫైనల్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ‘జెంటిల్మెన్’ సినిమాలో నటించిన నివేదా థామస్ ను చెల్లెలి పాత్ర కోసం సంప్రదిస్తున్నారని టాక్.
మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న నివేదాకు టాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. హీరోయిన్ గా తన జోరు చూపించడానికి రెడీ అవుతోన్న నివేదా.. చెల్లెలి పాత్రలో నటిస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పవన్ సినిమా గనుక ఒప్పుకునే ఛాన్స్ ఉందేమో చూడాలి!