HomeTelugu Trendingరూమర్స్‌పై స్పందించిన నిత్యామీనన్

రూమర్స్‌పై స్పందించిన నిత్యామీనన్

Nithya menon

ప్రముఖ నటి నిత్యా మీనన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తనను ఓ తమిళ హీరో వేధింపులకు గురిచేశాడని తాను చెప్పినట్టుగా పలు కథనాలు వెలువడుతున్నాయి. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో తమిళ్ హీరో తనను వేధించినట్టు వచ్చిన కథనాలపై నిత్యామీనన్ స్పందించింది.

తెలుగు పరిశ్రమలో నేను ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ, తమిళ పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా తమిళ హీరో నన్ను వేధింపులకు గురి చేశాడు అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ నిత్యా మీనన్ మండిపడింది. జర్నలిజంలో కొన్ని వర్గాలు ఈ స్థాయికి దిగజారడం ఎంతో బాధను కలిగిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. తప్పుడు కథనానికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది.

ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ వదంతుల వ్యాప్తిని ఎవరు మొదలు పెట్టారో చెప్పండి. కేవలం క్లిక్‌ల కోసం ఈ తరహా అవాస్తవాలను ప్రచారం చేసే వారిని బాధ్యులను చేయాలని నిత్య మండిపడుతోంది.

నేను ఇలా రియాక్ట్ అయితే గానీ ఇలాంటి పిచ్చి వార్తలు ఆగవనే ఈ నిర్ణయం తీసుకున్నా. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అని నిత్యా మీనన్ స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చింది.

https://www.instagram.com/p/CxqE3nYtVR-/?utm_source=ig_web_button_share_sheet

Recent Articles English

Gallery

Recent Articles Telugu