బబ్లీ బ్యూటీ నిత్యామీనన్ తాజాగా మరో వెబ్‌సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అవసరాల శ్రీనివాస్ భారీ బడ్జెట్‌తో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈసిరీస్‌లో ప్రధాన పాత్రకు నిత్యా మీనన్‌ను సంప్రదించారట. వెబ్ సిరీస్ చేసేందుకు నిత్యా మీనన్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ వెబ్‌సిరీస్ ను వైజయంతి మూవీస్ నిర్మాణంలో రూపొందనుందట. దీనిపై నిత్యామీనన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే హిందీలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అందులో లిప్‌లాక్ సీన్లో నటించి అందరికీ షాకిచ్చింది.