నటి నిత్యామీనన్ పాత్ర యాక్షన్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఇటీవలే గీత గోవిందం సినిమాలో సినిమాను నెరేట్ చేస్తూ కనిపించింది. ‘గీత గోవిందం’ తరువాత ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మాత్రం నిత్యా ఘాటుగా సమాధానం
ఇచ్చింది.
“లావు స్వాగత విషయం అని అలా ఉన్నానని అసలు ఫీల్ కావడం లేదని.. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న అమ్మయినని, నా లైఫ్ ఏంటో నేను ఎలా ఉండాలని అనుకుంటున్నానో ఓ క్లారిటీ ఉందని, ఏ పనిపాట లేనివాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తుంటారని” మండిపడింది.
సినీ ఇండస్ట్రీలో ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్లలో నిత్యా మీనన్ ఒకరు. మనసులో ఉన్నది ఏమిటో దానిని బయటకు కక్కేస్తుంటారు. ఇలా ముక్కుసూటిగా మాట్లాడటం వలన అనేక అవకాశాలను మిస్ చేసుకున్నది నిత్యా మీనన్.