యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నితిన్ ఓ ఇంటర్యూలో మాట్లాడాడు. ఈ చిత్ర విశేషాల గురించి చెప్పిన నితిన్, తన తదుపరి చిత్రాల షూటింగ్స్, పెళ్లి పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో తాను నటించిన మూడు చిత్రాలు విడుదలవుతాయని, ఆ సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయని చెప్పాడు.
తన పెళ్లి ఏప్రిల్ 16న అని, ఆరో తేదీ వరకూ షూటింగ్స్ ఉన్నాయని, కేవలం, పది రోజుల్లోనే పెళ్లి పనులు చూసుకోవాలని అన్నాడు. మే 1 నుంచి మళ్లీ షూటింగ్స్ మొదలవుతాయని అన్నాడు. పెళ్లికి ధరించే కొత్త దుస్తుల గురించి ప్రశ్నించగా నితిన్ స్పందిస్తూ.. అసలు, కొత్త బట్టలపై తనకు మోజు లేదని చెప్పాడు. తాను హీరో కాక ముందు పుట్టినరోజులకు, పండగలకు కొత్త దుస్తులు ధరించాలనేది ఉండేది కానీ, ఇప్పుడు అలా లేదని అన్నాడు. ఎందుకంటే, షూటింగ్స్ నిమిత్తం రోజూ మంచి బ్రాండ్స్ కు చెందినవి ధరిస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు ఈ హీరో.