టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇక నితిన్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల్లో నటించాల్సి ఉంది. ఇప్పటికే డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదల అయ్యింది. దీనితో మేర్లపాకా గాంధీ.. చంద్రశేఖర్ యెలేటి.. కృష్ణ చైతన్యల సినిమాలను కమిట్ అయ్యాడు నితిన్. అయితే ఈ యంగ్ హీరో ఇప్పుడు ఫిట్నెస్ పైన దృష్టిపెట్టాడు. పూర్తి ఫిట్నెస్ కు తిరిగి రావడానికి జిమ్ కి వెళుతున్నాడు. తాజాగా నితిన్ వర్కౌట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అతను మూడున్నర నిమిషాల్లో 500 జంప్ థ్రెడ్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. నితిన్ పర్ఫెక్ట్ ఫిట్ అని ఈ వీడియో ప్రూవ్ చేస్తోంది.