HomeTelugu Trendingనితిన్ సరసన హీరోయిన్‌గా ప్రియా వారియర్

నితిన్ సరసన హీరోయిన్‌గా ప్రియా వారియర్

3 21యువ హీరో నితిన్ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. నితిన్‌కి ఇది ‌28వ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ‘వింక్’ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నితిన్‌ సరసన హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసింది. మరో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌
సింగ్‌ నటించనుంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని నితిన్‌ అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

చంద్రశేఖర్‌ యేలేటితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని.. తన 28వ సినిమాకు ముహూర్తం ఖరారైనట్లు వెల్లడించాడు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మొత్తానికి రకుల్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌లతో కలిసి పనిచేయబోతున్నాను. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నట్లు నితిన్ తెలిపాడు. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో
బిజీగా ఉన్నారు. రష్మికా మందన కథానాయికగా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu