హీరోయిన్, బుల్లి తెర నటి నీతి టేలర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రోజు ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేసింది. హిందీలో పలు పాప్యులర్ సీరియల్స్ లో నటించి ఆమె మంచి పేరు తెచ్చుకుంది మిస్ నుంచి మిసెస్‌గా మారాను. ఈ విషయాన్ని నన్ను అభిమానించే వారందరికి చెప్పాలని అనుకుంటున్నాను’ అంది. ఈ ఏడాది ఆగస్టు 13న పరిక్షిత్ అనే అబ్బాయిని వివాహం చేసుకున్నానని, కరోనా కారణంగా కుటుంబ సభ్యులు దగ్గరి బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరగిందని వివరించింది. తనకు చాలా హ్యాపీగా ఉందని, పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో ఇంత ఆలస్యంగా ఎందుకు చెబుతున్నానన్న విషయాన్నీ ఆమె తెలిపింది.
కరోనా కారణంగా తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టినట్లు చెప్పింది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత అంగరంగ వైభవంగా విందు ఏర్పాటు చేసుకోనున్నట్లు వివరించింది. ఆమె కుటుంబ సభ్యులు మొదట అక్టోబర్ లో పెళ్లి చేయాలని అనుకున్నారు. కరోనా ప్రభావం మరింత పెరిగే అవకాశముంటుందని భావించి ఆగస్టులోనే వివాహం జరిపించారు. కాగా, తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’, ‘పెళ్లి పుస్తకం’, ‘లవ్ డాట్ కామ్’ వంటి సినిమాల్లో ఆమె నటించింది.