కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మలయాళంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నారు. దక్షిణాది భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో సేతుపతి సరసన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ నటించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి నటన సినిమాకు హైలైట్ గా ఉంటుందని వినికిడి. తెలుగులోత్వరలో ఉప్పెన సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ఇటీవలే శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న 800 లో నటిస్తున్నానని ప్రకటించారు.