HomeTelugu Trendingయాక్టింగ్‌ నుండి బ్రేక్‌ తీసుకుంటున్నా: నిత్యామీనన్‌

యాక్టింగ్‌ నుండి బ్రేక్‌ తీసుకుంటున్నా: నిత్యామీనన్‌

Nithya menon break to shoot
టాలీవుడ్‌లో ‘అలా మొదలైంది’ సినిమాతో.. ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్‌. తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతకాలంగా ఆమె తమిళం, మలయాళం చిత్రాలతో బిజీ ఆయిపోయింది. దీంతో కొంతకాలం తెలుగులో కనిపించని నిత్యా ఇటీవల భీమ్లా నాయక్‌ చిత్రంతో పాటు ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ అలరించింది.

ఈ క్రమంలో ఆమె తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు తాజాగా షాకిచ్చింది ఆమె. ఇక తాను సినిమాలకు, నటనకు బ్రేక్‌ తీసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చంది. కాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌ ముచ్చటించిన నిత్యా ఈ సందర్భంగా తాను యాక్టింగ్‌ బ్రేక్‌ తీసుకుంటున్నాని తెలిపింది. అయితే ఇది తాత్కాలికం వరకే అని కూడా స్పష్టం చేసింది. ఏడాదిగా సినిమా, వెబ్‌ సిరీస్‌లు, షోలో క్షణం తీరిక లేకుండా ఉన్నానని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. అయితే ఈ బ్రేక్‌ పెళ్లి కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది.

అంతేకాదు ఈ సందర్భంగా తన పెళ్లి పుకార్లను కూడా ఖండించింది. ప్రస్తుతం తాను కెరీర్‌పైనే ఫోకస్‌ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నిత్యా.. తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంది. తన సినిమాలన్ని వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

https://www.instagram.com/tv/CgbyaVwh1lc/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu