HomeTelugu Trendingపెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్‌!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్‌!

Nithya menen wedding rumors
టాలీవుడ్‌లో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్‌. ఏ భాషలో నటించిన తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటుందామె. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తన మల్టీ టాలెంట్‌తో పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకుంది. బాల నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిత్యాపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్లు వినిపించలేదు.

తాజాగా నిత్యా పెళ్లికి సంబంధించి రకరకాల పుకార్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడు పదుల వయసులో ఉన్న నిత్యా మీనన్‌ ప్రస్తుతం పెళ్లి రెడీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది చిత్ర పరిశ్రమలోని వ్యక్తే నని, అతడు ఓ స్టార్‌ యాక్టర్‌ అని టాక్‌. సదరు హీరోకు, నిత్యాకు కొంతకాలంగా మంచి సాన్నిహిత్యం ఉందని, త్వరలోనే అతడితో ఏడడుగులు వేయబోతుందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. కాగా ఇటీవల భీమ్లానాయక్‌ చిత్రంతో అలరించిన నిత్యా మీనన్‌ తాజాగా ‘మోడ్రన్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో జూలై 8న విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu