పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా ప్రధాన పాత్రల్లో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్. అక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జంటగా హీరోయిన్ నిత్యామీనన్ ఫిక్స్ అయింది. ఈ రోజున ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్ కమ్ చెబుతూ.. ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ రోజు నుంచి పవన్ – నిత్యామీనన్ కాంబినేషన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. రానాకు జంటగా ఐశ్వర్య రాజేశ్ చేయనున్నట్లు తెలస్తోంది. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానున్నట్టు సమాచారం. పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
We are extremely delighted to welcome an exceptional & proficient talent @menennithya on board for our #ProductionNo12 ⭐#BheemlaNayak Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/xxfRx8znFZ
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2021