నిత్యా మీనన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన అద్బుత నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటూ.. మంచి పాత్రలు చేసేంది ఈ బొద్దుగుమ్మ. ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లను చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్ ఇన్ టూ ది షాడోస్’ అనే వెబ్ సిరీస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిత్యా మీనన్ వివాస్పద పాత్రలో నటించింది. ఈ వెబ్‌సీరిస్‌లో నిత్యా మీనన్.. మరో నటితో లిప్‌లాక్ సన్నివేశాలు హీట్ పుట్టిస్తున్నాయి.
ఈ సన్నివేశాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ ఇలాంటి వివాస్పద పాత్ర చేయడానికి ఎలా అంగీకరించింది అంటూ ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. కానీ యూత్ మాత్రం నిత్యామీనన్.. ఈ హాట్ కిస్సింగ్ సన్నివేశాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో నిత్యామీనన్ ‘అ’ చిత్రంలో ఇలాంటి వివాదాస్పద లెస్పిబియన్ పాత్రలో నటించింది.