హీరో నితిన్ నటించిన తన కెరీర్ లో 31వ చిత్రాన్ని నేడు వినాయకచవితి సందర్బంగా పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో పలు సూపర్‌హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎస్‌ఆర్ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా సందడి చేయనున్నారు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఈ సినిమాకి ‘మాచర్ల నియోజకవర్గం’ అనే డిఫరెంట్ పొలిటికల్ టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ టైటిల్ బట్టి చూస్తుంటే నితిన్ రాజకీయ నేపథ్యంలోనే వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ ను షూటింగ్ ను ప్రారంభించనున్నారు.