హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో విజయం సాధించిన ‘అంధాదున్’ సినిమాకి ఇది తెలుగు రీమేక్. ఇందులో నితిన్ సరసన నభా నటేశ్ నటిస్తోంది. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శ్రేష్ట్‌మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘బేబీ ఓ బేబీ’ అంటూ సాగే పాట ప్రోమోను వదిలారు. పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు.
Here’s #BabyOBaby Foot tapping song that fills rainbow colors to our #MAESTRO vision🌈
🎤@anuragkulkarni_
✍🏻#SREEJO
🥁@mahathi_sagar
@NabhaNatesh @MerlapakaG @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella pic.twitter.com/bgA7jyWn0M— nithiin (@actor_nithiin) July 16, 2021