HomeTelugu Newsనితిన్‌ వివాహంపై కీలక నిర్ణయం..

నితిన్‌ వివాహంపై కీలక నిర్ణయం..

10 17

టాలీవుడ్ హీరో నితిన్ నిశ్చితార్థం ఇటీవలే షాలిని అనే అమ్మాయితో జరిగింది. నితిన్, షాలిని కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. దుబాయ్ లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఏప్రిల్ 16న ముహుర్తం పెట్టుకున్నారు అయితే కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉడటంతో సామాజిక బాధ్యత దృష్ట్యా పెళ్లి వాయిదా వేసుకోవడమే మేలని నితిన్ భావించాడు. ఈ నేపధ్యంలో ఇరు కుటుంబ సభ్యులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో పరిస్థితులు కుదుట పడే అవకాశం లేదని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానింగ్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారట. వచ్చే నెలలో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నితిన్ షాలినిల వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu