హీరో నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘భీష్మ’. ఈసినిమా నుండి మరో సాంగ్ విడుదలైంది. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకు ముందు టీజర్ విడుదల కాగా తాజాగా ఈ సినిమా నుండి మాస్ సాంగ్ ‘వాట్ యే బ్యూటీ’ వీడియో ప్రోమో రిలీజ్ అయింది. ఈ సాంగ్‌లో నితిన్ స్టెప్స్.. రష్మిక గ్లామర్ హైలైట్‌గా నిలిచింది. చూస్తుంటే ఈ సినిమాలో నితిన్ రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది. భీష్మపై నితిన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రబృందం. భీష్మ సినిమా పూర్తిగా కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందులో భాగంగా ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ భీష్మ సినిమాని నిర్మిస్తున్నాడు.