టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం హైదరాబాద్లో నితిన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పరిమిత సంఖ్యలో సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకని నిర్వహించారు. షాలిని అనే అమ్మాయిని నితిన్ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఎప్రిల్ 16 నితిన్ వివాహం జరుగనుంది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు.