నితిన్ హీరోగా ఇటీవలే కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో సందడి చేయనుంది. నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా చేయబోతున్నట్లు వచ్చిన రూమర్‌లు నిజమేనని ఫస్ట్‌లుక్‌తో క్లారిటీ వచ్చేసింది.
షూటింగ్ బ్యాక్ గ్రౌండ్‌లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్‌ల బాధను ఈ సినిమాలో ఫన్నీ యాంగిల్‌లో చూపించనున్నారట. అటు నితిన్‌కు ఇటు వక్కంత వంశీకు ఈ సినిమా మంచి కంబ్యాక్ అవుతుందని టాలీవుడ్ టాక్. విడుదలకింకా 5నెలలకు పైగా టైమున్నా ఈ సినిమాకు ఇప్పటి నుంచే మంచి హైప్‌ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
డేంజర్ పిల్లా అంటూ సాగే పెప్పీ నెంబర్‌ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. హారీస్ జైరాజ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.