
Nithiin Robinhood OTT Rights:
నితిన్ హీరోగా, వేంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘Robinhood’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. మార్చి 28, 2025న ఈ యాక్షన్-కామెడీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసాయి.
ఈ సినిమా OTT & సాటిలైట్ హక్కులు ZEE గ్రూప్ భారీ డీల్‌లో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ZEE5 లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే, ZEE తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సినిమా OTTలో ఎప్పుడు వస్తుందనే వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ లాంటి టాప్ కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. ప్రొడక్షన్ పరంగా మైత్రీ మూవీ మేకర్స్ భారీగా వెచ్చిస్తుండగా, GV ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం మరో అట్రాక్షన్ కానుంది.
‘Robinhood’ కథ, కామెడీ, యాక్షన్ కలయికలో కొత్తగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలు, పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. మరి నితిన్, వేంకీ కుడుముల కాంబో మరో హిట్ అందుకుంటుందా? అనేది చూడాలి!