HomeTelugu Reviews'రంగ్‌ దే' రివ్యూ

‘రంగ్‌ దే’ రివ్యూ

Rang de movie reviewటాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటించిన చిత్రం ‘రంగ్‌ దే’‌. ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరితో దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. నితిన్‌ కెరీర్‌లో 29వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ: అర్జున్‌(నితిన్‌) చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడతాడు. అదే పక్కిటి అమ్మాయి అను(కీర్తి సురేష్‌) టాపర్‌. దీంతో ప్రతిసారి అర్జున్‌ వాళ్ల నాన్న(నరేశ్‌)అనుతో పోలుస్తూ అతన్ని తిడుతుంటాడు. ఇలా ఫస్ట్‌ క్లాస్‌ నుంచి బీటెక్‌ వరకు అను వల్ల అర్జున్‌కు తిట్లు పడుతూనే ఉంటాయి. దీంతో అర్జున్‌కు అను అంటే విపరీతమైన కోపం, ద్వేషం ఏర్పడుతుంది. కానీ అనుకు మాత్రం అర్జున్‌ అంటే ఇష్టం. పెద్దయ్యాక ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. అర్జున్‌కు మాత్రం వయసుతో పాటు అనుపై కోపం పెరుగుతూనే వస్తుంది. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే అనుకొని ఒక సంఘటన వల్ల అర్జున్‌ అనుని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. అనుతో మాట్లాడడానికే ఇష్టపడని అర్జున్‌ ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి తర్వాత ఆమెతో కాపురం ఎలా చేశాడు? వారిద్దరి మధ్య గొడవలు అలానే నడిచాయా? లేదా ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారం చేశారా? చివరికి ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అనేదే కథ.

నటీనటులు: నితిన్‌ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. క్యూట్‌ అండ్‌ స్టైలీష్‌ లుక్‌తో అదరగొట్టాడు. కామెడీ స్లీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలలో అవలీలగా నటించాడు. కీర్తి సురేష్‌ అల్లరి పిల్ల అను పాత్రలో జీవించేసింది. అమాయకంగా ఉంటూనే అర్జున్‌ని ఇరకాటంతో పడేస్తుంది. కొన్ని ఎమోషన్‌ సీన్లలో కూడా అవలీలగా నటించి నిజంగానే మహానటి అనిపించుకుంది. హీరో తండ్రి పాత్రలో నరేశ్‌ అలరించాడు. తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఇక హీరో స్నేహితులుగా ‘కలర్‌ ఫోటో’ ఫేమ్‌ సుహాస్‌‌, అభినవ్‌ గౌతమ్‌ పర్వాలేదనిపించారు. సెకండాఫ్‌లో వచ్చిన వెన్నల కిషోర్‌ ఉన్నంతలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. వినీత్‌, సత్యం రాజేశ్‌, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

విశ్లేషణ: ప‌క్క ప‌క్కనే ఉండే రెండు కుటుంబాల క‌థ ఇది. స‌హ‌జంగానే మ‌నం మ‌న ఇంట్లోవాళ్ల‌ను ప‌క్కింటివాళ్ల‌తో పోల్చి చూస్తుంటాం. ముఖ్యంగా చదువు విషయంలో ఈ పోలికలు మరీ ఎక్కువ. తమ బిడ్డ కంటే పక్కింటి వాళ్లు బిడ్డకు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన బాధపడే తల్లిదండ్రులు కోకొల్లలు. దీంతో పక్కింటి వాళ్లతో పోల్చడంతో సహజంగానే ఆ పిల్లల మధ్య అసూయ, ద్వేషం లాంటి ఏర్పడతాయి. ఈ సినిమా నేపథ్యం కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మ‌ధ్య వ్యవహారం పెళ్లిదాకా వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులకు దారి తీస్తాయనేదే ‘రంగ్‌దే’ కథ.

దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. కథలో కొత్తదనం లేకపోయిన్పటికీ.. తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్‌ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి అలరిస్తాయి. అను, అర్జున్‌ మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ ప్రేక్షకులను అట్రాక్ట్‌ చేస్తుంది. అయితే స్లో నెరెషన్‌ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫ‌స్టాఫ్‌లో సినిమానే బాగానే న‌డిపించిన, సెకండాఫ్ కాస్త బెరిసి కొట్టించిన‌ట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. కథంతా రోటీన్‌గా సాగడం, దానికి తోడు ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తుకు తేవడం ప్రతికూల అం‍శమే. దేవి శ్రీ ప్రాసాద్‌ సంగీతం ఈ సినిమాకి హైలైట్‌. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అద్భుతంగా ఇచ్చాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్‌ దే స్టోరీ రొటీనే అయినప్పటికీ అర్జున్‌, అనుల టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ యువతను ఆకట్టుకుంటుంది.

టైటిల్: రంగ్‌దే
న‌టీన‌టులు: నితిన్‌, కిర్తి సురేశ్‌, నరేశ్‌, వెన్నెల కిశోర్‌, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి
నిర్మాత : సితారా ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: దేవి శ్రీ ప్రాసాద్‌

హైలైట్స్: నితిన్, కీర్తి సురేష్ నటన
డ్రాబ్యాక్స్: కథలో కొత్తదనం లేకపోవడం
చివరిగా: యూత్‌ని ఆకట్టుకునేలా ‘రంగ్‌దే’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu