టాలీవుడ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఆదివారం ఉదయం విడుదల చేసింది. టీజర్‌లో నితిన్ చెప్పే డైలాగులు చాలా సరదాగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఎవరి వాల్యూ అయినా బతికున్నప్పుడు కంటే చనిపోయాకే పెరుగుతుంది భయ్యా’ అని నితిన్ చెప్పగానే.. ‘అదెలా’ అని వెన్నెల కిషోర్ ప్రశ్నిస్తాడు. ‘ఓ కోడి బతికున్నప్పుడు కిలో 90 రూపాయాలు.. అదే చనిపోయాక కిలో 190 రూపాయలు.’ అని నితిన్ చెప్పే సమాధానం ఫన్నీగా అనిపిస్తుంది. మరోవైపు రఘుబాబు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అలరిస్తుంది. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం అలరించింది. ఫిబ్రవరి 21న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.