ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో పంక్షన్లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితిన్ పెళ్లిపై కూడా పడిందని ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన.. షాలినితో ఇటీవల నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఏప్రిల్ 16న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఏప్రిల్ 21న హైటెక్స్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. వాయిదా వేయకుండా వివాహాన్ని నిర్ణయించిన ముహూర్తానికే జరపాలని పెద్దలు నిర్ణయించారు.
కాగా ఇప్పటికే కంచి, చెన్నైలో పెళ్లి దుస్తులు కూడా కొనుగోలు చేశారు. కరోనా వైరస్ అదుపులోకి వస్తే దుబాయ్‌లో పెళ్లి జరుపుతామని, లేకుంటే హైదరాబాద్‌లోనే అనుకున్న ముహూర్తానికి వివాహం జరుపుతామని పెద్దలు అంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. వివాహం దుబాయ్‌లోనా? హైదరాబాద్‌లోనా? అన్న విషయంపై మాత్రమే స్పష్టత రాలేదు. అయితే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించనున్నారు.