HomeTelugu Trendingనాకు మరో బిడ్డ పుట్టబోతుంది: నిషా అగర్వాల్‌

నాకు మరో బిడ్డ పుట్టబోతుంది: నిషా అగర్వాల్‌

Nisha aggarwal shares beaut

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. 2020 అక్టోబర్‌30న వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడిన కాజల్‌ ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. తాజాగానే సీమంతం ఫొటోలను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది కాజల్‌. ఇక బేబీ కాజల్‌ కోసం ఆమె ఫ్యామిలీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంది.

తాజాగా ఇదే విషయాంపై కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ స్పందించారు. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. నా రెండవ బిడ్డ ఆన్‌ ది వే. నిన్ను కలుసుకోవడానికి ఇంకా వెయిట్‌ చేయలేను లిటిల్‌ వన్‌ అంటూ కాజల్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోట్‌ కాబోతున్న కాజల్‌-కిచ్లు దంపతులకు బెస్ట్‌ విషెస్‌ తెలియజేసింది. ప్రస్తుతం నిషా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu