ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం
‘ఏ దిల్ హై ముస్కిల్’. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్
ల మధ్య హాట్ సీన్స్ ఉన్నాయి. ఇటీవల విడుదలయిన టీజర్స్ తో వారి మధ్య రొమాన్స్ ఏ
రేంజ్ లో చూపించబోతున్నారో.. అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే సెన్సార్
సభ్యులు మాత్రం ఆ సీన్స్ అన్నింటినీ కట్ చేయమని చెప్పేసారట. అలానే ఈ సినిమాలో
పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడు. ఇండియాకు, పాకిస్థాన్ కు మధ్య సంబంధాలు
తగ్గిపోతున్న ఈ తరుణంలో బాలీవుడ్ పాక్ నటులను నిషేదించింది. కానీ ఈ సినిమాలో ఫవాద్
నటించడంతో శివసేన పార్టీ ఈ సినిమాను థియేటర్లో ప్రదర్శించనివ్వమని ప్రకటించేసింది.
దీనికి తోడు ఇప్పుడు ఐశ్వర్యారాయ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననని స్టేట్మెంట్ ఇచ్చింది.
ఇప్పటికే కష్టాల్లో ఉన్న కరణ్ జోహార్ ను ఐశ్వర్యారాయ్ కూడా ఇరకాటంలో పడేసిందని
చెప్పుకుంటున్నారు.