దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క ప్రముఖ నిర్మాతతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మన సినిమా హీరోయిన్స్ కు పెళ్లి జరుగుతుందంటే చాలు.. అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక అలాంటి వార్త అనుష్కపై వస్తే ఇంకేముంది.. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు విషయమేమిటంటే.. గత కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారట. ఈ విషయం నిర్మాత ఇంట్లో వారికి కూడా తెలుసు అన్నట్లు సమాచారం. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ నిర్మాత ఇప్పటికే అనుష్కతో చాలా చిత్రాలను నిర్మించాడట. అంతేకాదు ఆయనకు ఆల్రెడీ ఒకసారి పెళ్లి కూడా జరిగింది. ఇంతకీ ఆ ప్రముఖ నిర్మాత ఎవరో మీరు కూడా ఆలోచించండి. సినిమాల విషయానికొస్తే.. అనుష్క ప్రస్తుతం బాహుబలి 2, బాగమతి చిత్రాల్లో నటిస్తోంది.