నిర్భయ దోషులను ఉరితీసేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా… మరోవైపు కన్నింగ్ ఐడియాలతో శిక్ష అమలులో మరింత జాప్యం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు దోషులు… తాజాగా మరోసారి ఉరిశిక్ష వాయిదా కోసం కొత్త డ్రామాకు తెరలేపారు దోషి వినయ్ శర్మ… జైలు గదిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు… జైలు గదిలోని గోడకు తన తలను బాదుకొని గాయపర్చుకున్నాడు. ఇక, అప్రమత్తమైన జైలు అధికారులు వినయ్ శర్మను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో దోషులను మార్చి 3న ఉరి తీయాలని పాటియాలాహౌస్ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని న్యాయస్థానం తీర్పుఇచ్చింది.. ఉరి శిక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా… మరోసారి పనికిమాలిన ఐడియాలతో తప్పించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారని నిర్భయ తల్లి అంటున్నారు. అయితే, ఉరిశిక్ష అమలు చేయాలంటే దోషి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి అనేది నియమం… ఇప్పుడు వినయ్ శర్మ తన తలకు గాయం చేసుకోవడంతో శిక్ష అమలు చేస్తారా? మరోసారి వాయిదా పడుతుందా? అనేది చూడాలి