HomeTelugu Big Stories'నిను వీడని నీడను నేనే' మూవీ రివ్యూ

‘నిను వీడని నీడను నేనే’ మూవీ రివ్యూ

హీరో సందీప్‌ కిషన్ సక్సెస్‌ కోసం ఎదురుచుస్తున్నాడు. తన కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను గాడిలో పెట్టే బాద్యతను తానే తీసుకున్నాడు. అందుకే స్వయంగా నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో ‘నిను వీడని నీడను నేనే’ సినిమాని నిర్మించాడు. తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజును టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సందీప్‌కి ఆశించిన విజయం అందించిందా..? హీరోగా, నిర్మాతగా రెండు బాద్యతలను సందీప్ సమర్థవంతంగా నేరవేర్చడా.. ఈ సారి అయిన తన అదృష్టం ఫలిస్తుందా అని చూడాలి..

5 11

కథ : సినిమా కథ 2035లో మొదలవుతుంది. సైకాలజీ ప్రొఫెసర్‌(మురళీ శర్మ) తను డీల్‌ చేసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పటం మొదలు పెడతాడు. కథ 2013 సంవత్సరానికి మారుతుంది. అర్జున్ (సందీప్‌ కిషన్‌), మాధవి (ఆన్య సింగ్) భార్య భర్తలు. ఓ బంగ్లాలో నివాసం ఉంటున్న వీరికి ఓ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. వారు అద్దంలో చూసుకున్నప్పుడు వారికి బదులుగా ఇతర వ్యక్తులు రిషీ, దియా ముఖాలు కనిపిస్తుంటాయి. అద్దంలో వేరే వ్యక్తులు కనపడడానికి కారణం ఏంటి.? అద్దంలో కనిపించేది ఎవరు? చివరకు రిషీ, దియాలు ఏమయ్యారు? అన్నదే కథలోని అంశం

నటీనటులు : సందీప్ కిషన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. తనకు బాగా పట్టున్న కామెడీతో పాటు హారర్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. హీరోయిన్ ఆన్య సింగ్ తెలుగులో తొలి సినిమానే అయినా మంచి మార్కులు సాధించింది. లుక్స్‌ పరంగా ఆకట్టుకున్న ఆన్య నటనలోనూ పరవాలేదనిపించింది. మరో కీలక పాత్రలో నటించిన వెన్నెల కిశోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ప్రగతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

5a 1

విశ్లేషణ : దర్శకుడు కార్తిక్‌ రాజు సందీప్‌ కిషన్‌ కోసం ఆసక్తికర కథను సిద్ధం చేశాడు. సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పాయింట్‌తో సినిమాను మొదలు పెట్టాడు. అయితే కీలకమైన మలుపులన్ని ద్వితీయార్థంలో చూపించిన దర్శకుడు మొదటి భాగంలో కథను కాస్త నెమ్మదిగా నడిపించాడు. రెండోవ భాగంలో అసలు కథ మొదలవుతుంది. వరుస ట్విస్ట్‌లతో ద్వితీయార్థాన్ని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌, ప్రీ క్రైమాక్స్‌, క్లైమాక్స్‌లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో లాజిక్‌ల కోసం వెతికితే మాత్రం కష్టం. థ్రిల్లర్‌ సినిమాలకు తమన్ ఎప్పుడూ అద్భుతంగా మ్యూజిక్‌తో అలరిస్తాడు. ఈ సినిమాలోనూ తమన్ తన మార్క్‌ చూపించాడు. పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌పాయింట్‌. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

హైలైట్స్‌ :
సందీప్ కిషన్ నటన

డ్రాబ్యాక్స్ :
లాజిక్ లేని సీన్స్

5b

టైటిల్ : నిను వీడని నీడను నేనే
నటీనటులు : సందీప్‌ కిషన్‌, అన్యా సింగ్‌, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ
సంగీతం : తమన్
దర్శకత్వం : సందీప్‌ కిషన్, సుప్రియ కంచర్ల
నిర్మాత : సురేష్ బాబు, సునితా తాటి, టీజీ విశ్వప్రసాద్‌, హ్యూన్వూ థామస్ కిమ్

చివరిగా : అద్దంలో థ్రిల్లర్‌ మూవీ చూపించిన సందీప్‌ కిషన్
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

హీరో సందీప్‌ కిషన్ సక్సెస్‌ కోసం ఎదురుచుస్తున్నాడు. తన కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను గాడిలో పెట్టే బాద్యతను తానే తీసుకున్నాడు. అందుకే స్వయంగా నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో 'నిను వీడని నీడను నేనే' సినిమాని నిర్మించాడు. తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజును టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ...'నిను వీడని నీడను నేనే' మూవీ రివ్యూ