‘పలాస 1978’ ఫేం రక్షిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పుష్ప ఫేం శత్రు విలన్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సెబాస్టియన్ నోహ్ అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై అజ్జ శ్రీనివాస్, కారుమూరు రఘు
నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు.
తాజాగా ఈ మూవీ నుంచి నిన్ను వదలి నేనుండగలనా అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ ని విడుదల చేశారు. ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ పాటను విజయ్ ప్రకాష్, చిన్మయి శ్రీపాద ఆలపించగా.. నౌఫల్ రాజా AIS సంగీతం అందించాడు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న మూవీని విడుదల తేదీకి సంబంధించి త్వరలోనే అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.