HomeTelugu Trendingనాకు డెలివరీ డేట్ తెలుసుకోవాలనుంది: నిక్కీ గల్రానీ

నాకు డెలివరీ డేట్ తెలుసుకోవాలనుంది: నిక్కీ గల్రానీ

Nikki Galrani clarity on he
కోలీవుడ్‌ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈజంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిక్కీ గల్రాని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆది దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. తాజాగా నిక్కీ స్పందించింది.

తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలను సోషల్ మీడియా వేదికగా నిక్కీ ఖండించింది. ఈ బిగ్ న్యూస్ గురించి నాకు కూడా తెలియదు. నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు నా తరపున వైరల్ అనౌన్స్ మెంట్ చేస్తున్నారు. ప్లీజ్.. నాకు ఆ డెలివరీ డేట్ తెలుసుకోవాలనుంది’ అంటూ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేసింది.

“నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు. భవిష్యత్తులో అయితే ఈ అమేజింగ్ న్యూస్ ని నేనే ఫస్ట్ తెలియజేస్తా. దయజేసి రూమర్లను ప్రచారం చేయకండి” అంటూ నిక్కీ గల్రాని తన నోట్ ద్వారా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu