టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ట్రైలర్ చూశాక ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయ్యాయి. సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. నిన్న, మొన్నటి వరకు ఈ సినిమా రిలీజ్‌పై గందరగోళమే ఉంది. అయితే ఆదిపురుష్ స్పీడ్ తగ్గడంతో హఠాత్తుగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఏకంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించేశాడు.
ఫస్ట్ సింగిల్ గానీ, రిలీజ్ డేట్ పోస్టర్ గానీ నిఖిల్‌కు సంబంధం లేకుండానే నిర్మాత విడుదల చేశాడు. కాగా క్వాలిటీ కోసం, సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయడం కోసం విడుదలను వాయిదా చేయమని నిఖిల్ అడిగితే.. అలా చేస్తే చాలా నష్టం వస్తుందని నిర్మాత దానికి ఒప్పుకొలేదట. దాంతో కొన్ని చర్చల తర్వాత నిఖిల్, నిర్మాత దారిలోకి వచ్చేశాడు. ఆయన చెప్పిన డేట్‌కే కట్టుబడ్డాడు. ఇక తాజాగా దీనిపై ఈ యువ హీరో స్పందించాడు.
నిర్మాతతో గొడవపై స్పందిస్తూ.. ‘నిజమే.. మేం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. ఏం చేసినా అన్నీ సినిమా కోసమే. ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. 250 రూపాయలు పెట్టి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడ్ని ఎంటర్టైన్ చేయాలి. ఇది మంచి సినిమా, అందుకే టైమ్ తీసుకుందామని కోరాను. కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. ఏ మాత్రం క్వాలిటీ లేకపోయినా మార్నింగ్ షో తర్వాత ఆడియన్స్ ఉండరు. మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను ఫుల్ సాటీస్‌ఫై చేశారు. నేను తృప్తి చెందాను కాబట్టే, ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చానని’ చెప్పాడు.
సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉంది. ఈ లోపు వీలైనన్నీ ప్రమోషన్లు గట్రా చేసి సినిమాపై హైప్ తీసుకురావాలి. పైగా పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి రేయింబవళ్లు తీరిక లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. దానికి నిఖిల్ సైతం కట్టుబటి బ్యాక్ టు బ్యాక్ ప్రెస్మీట్లు చేస్తామని చెప్పాడు. ఇక జూన్ 27న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతుంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ గెస్ట్‌గా రాబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు