టాలీవుడ్ హీరో నిఖిల్ పెళ్లిపై వస్తున్న వదంతులపై స్పందించాడు. కరోనా కారణంగా తన పెళ్లి వాయిదా పడిందనే వార్తలను ఖండించాడు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. నా పెళ్లిపై ఆందోళన అవసరం లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాం అంటూ స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు.
గత కొద్దికాలంగా డాక్టర్ పల్లవితో ప్రేమలో ఉన్నాడు హీరో నిఖిల్. వివాహం గత నెల నిశ్చమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా భయాలు చోటుచేసుకోవడంపై నిఖిల్ స్పందిస్తూ.. ‘ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్నాం. నేపథ్యంలో ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు ఈ కుర్ర హీరో. అయితే వచ్చేవారానికల్లా పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం’ అని నిఖిల్ అన్నారు.