బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. బ్యాగ్రౌండ్ లేని వాళ్లను నిర్ధాక్షణ్యంగా తొక్కేస్తున్నారని.. టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు ఇవ్వడం లేదని చాలా మంది సెలబ్రిటీలు నుంచి నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా స్పందించాడు
ఇండస్ట్రీలో కచ్చితంగా నెపొటిజమ్ అనేది ఉంటుందని క్లరిటీ ఇచ్చేశాడు ఈ హీరో. సినిమా అనే కాదు అన్నిచోట్లా కూడా అలాంటి వాళ్లు ఉంటారని.. తొక్కేయడానికి చూస్తుంటారని చెప్పుకొచ్చాడు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇది ఇంకాస్త ఎక్కువే ఉంటుందని.. ఇక్కడ బ్యాగ్రౌండ్ లేని వాళ్లు కనిపించినపుడు కచ్చితంగా వాడు ఎదుగుతుంటే తొక్కడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పాడు నిఖిల్.
అప్పుడే మనకు మనం దృడంగా ఉండాలి.. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పోరాడి నిలబడాలి అంతేకానీ చావు పరిష్కారం కాదు కదా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతీ ఇండస్ట్రీలో కూడా ఇది మాములే అని తెలిసినపుడు కచ్చితంగా ఎన్ని కష్టాలొచ్చినా కూడా జీవితాన్ని మాత్రం ఇలా ముగించడం మంచిది కాదు. అలాంటి నిర్ణయాలు మానుకోవాలని అన్నాడు నిఖిల్.