ప్రస్తుతం హీరో నిఖిల్ ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల
విడుదలయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
రానుంది. దీని తరువాత నిఖిల్ తనతో ‘స్వామిరారా’ చిత్రాన్ని రూపొందించిన సుధీర్ వర్మతో
మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రానికి ‘కేశవ’ అనే టైటిల్ ను కన్ఫర్మ్
చేశారు. రీతూవర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక
పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్ ను సెలెక్ట్ చేశారట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇషా
కనిపించనున్నట్లు సమాచారం. గతంలో ఇషా, నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలో
నటించింది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ, హిందీలో
సినిమా సినిమాలు చేస్తూ.. బిజీగా మారింది. ఆమెను ప్రత్యేకంగా ఈ పాత్ర కోసం పిలిపించడం
హాట్ టాపిక్ గా మారింది.