టాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ’18 పేజెస్’. దీంతో పాటు ‘కార్తికేయ 2′ సినిమా కూడా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ’18 పేజెస్’ షూటింగును పూర్తిచేసుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. సుకుమార్ కథ అందించగా, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయినా, లైన్లో చాలానే సినిమాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమాను ఓటీటీ వైపు తీసుకెళదామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ’18 పేజెస్’ తరువాత ‘ కార్తికేయ 2’ ను పూర్తిచేయాలనే ఆలోచనలో నిఖిల్ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగును జరుపుకుంది.