బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ను షేక్ చేస్తూంది. అతడిని ఇండస్ట్రీలో తొక్కేశారు అంటు వారి పేర్లను బయటపెడుతూ పలువురు సినీ సెలెబ్రెటీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బాలీవుడ్ మాఫియాపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పులి సినిమా హీరోయిన్ నికిషా పటేల్ బాలీవుడ్‌కు చెందిన ఆ ప్రముఖులపై విమర్శలు గుప్పించింది. “నేను మిమ్ములను ఒకే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు సుశాంత్ అంత్య క్రియలకు ఎందుకు హాజరు కాలేదు. మీ మానవత్వం ఏమైపోయింది. ఆ టైమ్‌లో మీరు భోజనం చేస్తూ బిజీగా ఉండి పోయారా అంటూ సూటి ప్రశ్న సంధించింది.” నికిషా ప్రశ్నించిన విధానం పై పలువురు నెటిజనులు మద్దతు తెలుపుతున్నారు. ఎవరి వల్ల అయితే సుశాంత్ మృతి చెందాడో వాళ్లు సుశాంత్ అంత్యక్రియలకు హాజరు కాలేదు అంటూ మరికొందరు నెటిజన్స్ నికిషా పటేల్ పోస్ట్ కు కామెంట్ చేస్తున్నారు.