టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మైకేల్’ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్ కిషన్. ఆ సినిమా పేరే ‘ఊరు పేరు భైరవకోన’.
ఒక ప్రత్యేకమైన జోనర్లోని సినిమాలను చేసుకుంటూ వెళుతున్న వీఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ … ‘ఒక్క క్షణం’ చూస్తే, ఆయన మార్క్ సినిమాలు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన లైన్ పైనే ‘ఊరుపేరు భైరవకోన’ నడవనుంది.
ఈ సినిమాలో సందీప్ కిషన్ జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తుంది. ఈ సినిమాను రాజేశ్ దండ – బాలాజీ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘నిజమేగా చెబుతున్నా జానే జానా .. నిన్నే నే ప్రేమిస్తున్నా’ అంటూ సాగుతోంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు