HomeTelugu TrendingNiharika Konidela: నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

Niharika Konidela: నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

Niharikas love post goes v

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈమధ్యకాలంలో వరుస ఫొటో షూట్‌లు చేస్తుంది మరియు ఇటీవలే ఆమె విడాకులపై కూడా స్పందించింది. ఈ క్రమంలో రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. తాజాగా నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తే మళ్లీ ప్రేమలో పడ్డారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక యాంకర్‌గా, యూట్యూబర్‌, షార్ట్ ఫిల్మ్స్‌ తో మంచి పేరు తెచ్చుకుంది. ఆతరువాత ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించారు. గతేడాది ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.

వీటితో పాటుపలు OTT సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేసింది. ఇక 2020 లో చైతన్యతో నిహారికకు పెళ్లైంది. పెళ్లైన కొద్దిరోజులకే ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో 2023 మేలో మ్యుచువల్ డైవర్స్ తీసుకున్నారు. తాజగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.

‘నీకు కావాల్సింది ప్రేమ..బీచ్ మాత్రమే’ అంటూ నిహారిక తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో అంతా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతానికి తాను సింగిల్ అని.. లైఫ్‌లో హ్యాపీగా ఉన్నానని నిహారిక చెప్పారు. మరి ఈ పోస్టు ఏ ఉద్దేశంతో పెట్టి ఉంటారో? అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

Niharika

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu