HomeTelugu Big Storiesకాబోయే భర్తతో నిహారిక.. ఫొటో వైరల్

కాబోయే భర్తతో నిహారిక.. ఫొటో వైరల్

9 15
మెగా డాటర్‌ నిహారిక కొణిదెల పెళ్లి త్వరలో జరగనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిహారిక పెళ్లి త్వరలో జరుగుతుందని అని నాగబాబు అన్నారు కానీ.. సంబంధం కుదిరిందని వెల్లడించలేదు. అయితే నిహారిక పెళ్లిపై త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా నిహారిక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు చిన్న హింట్ ఇచ్చింది. నిహారిక స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘Ms. Niha’ అని రాసి ఉండగా ‘Ms.’ని కొట్టేసి ‘Mrs.’ అని క్వశ్చన్ మార్క్ ( ? ) పెట్టింది. దానికి ”ఉహ్.. వాట్ ?” అని కామెంట్ జత చేసింది. దీంతో మెగా అభిమానుల్లో నిహారిక పెళ్లిపై ఆసక్తికర చర్చ నడుతస్తుంది. నిహారిక పెళ్లి పిక్స్‌ అయిందని హింట్ ఇస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ పోస్ట్ కు చిరంజీవి కూతుళ్లు సుస్మిత శ్రీజ కూడా స్పందిస్తూ.. ‘వై’ అంటూ నిహారికను ప్రశ్నించారు.

ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ పెట్టి తన పెళ్లి విషయాన్ని కంఫర్మ్ చేసింది నిహారిక. తనకి కాబోయే భర్తని హగ్ చేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో మెగా డాటర్ కి వరుడు దొరికేశాడని అర్థం అయింది. కాకపోతే ఈ ఫొటోలో తనకు కాబోయేవాడి బ్యాక్ సైడ్ ని మాత్రమే చూపించింది. అతని ఫేస్ ని మాత్రం చూపించలేదు. ఇక సినీ ప్రముఖులు మెగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దీనికి స్పందిస్తూ ”గాడ్ బ్లెస్ యూ తల్లి” అని కామెంట్ పెట్టాడు. నిహారిక పెళ్లి గురించి రోజుకొక హింట్ ఇస్తూ వస్తుంది. ఇక రేపు ఆమెకు కాబోయే భర్త ఫేస్ చూపిస్తుందేమో అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిహారిక పెళ్ళి చేసుకోబేయే వ్యక్తి గుంటూరుకు చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకు అని.. ప్రకాశం జిల్లా చీరాలకి చెందిన వాడని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇక అధికారికంగా ప్రకటన వచ్చేవరుకు ఎదురు చూడాల్సిందే.

View this post on Instagram

Peek-a-boo

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu