మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక వివాహానికి సమయం దగ్గర పడింది. ఈ నెల(డిసెంబర్) 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది, ఆపై 11న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ ఉండనుంది. ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లి శుభలేఖలను నాగబాబు ఫ్యామిలీ పంచడం ప్రారంభించగా, ఆ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్ పూర్ ప్యాలెస్ ముందు ఏనుగు అంబారీలున్న ఆర్ట్ ను ముద్రించిన బాక్స్ లో వివాహానికి సంబంధించిన వివరాలను మెగా ఫ్యామిలీ తెలియజేసింది.