గతేడాది హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో పలకరించి మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ.. రాహుల్ విజయ్‌తో కలిసి ‘సూర్యకాంతం’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆహ్వానించి మంచి బజ్‌ను సొంతం చేసుకుంది ‘సూర్యకాంతం’. కాసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
దగ్గుబాటి రానా చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇద్దరి మధ్యలో నలిగే యువకుడిగా రాహుల్ విజయ్.. భిన్నమైన స్వభావం ఉండే ఓ క్యారెక్టర్‌లో నిహారిక నటిస్తున్నారు. ‘నాకు ఇన్‌డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. యెదవా!’, లాంటి డైలాగ్‌లతో ఉన్న ఈ ట్రైలర్‌లో నిహారిక ఆకట్టుకున్నారు. మార్క్ కె రూబిన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్‌సిరీస్ ఫేమ్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.