మెగా డాటర్ నిహారిక కొణిదెల గుర్తించి పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నిహాకిర ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయినా వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిహారిక పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం, ఆ తర్వాత పబ్ ఇన్సిడెంట్‌తో వార్తల్లో నిలిచిన నిహారిక తాజాగా తన లుక్‌ని మార్చేసింది. షార్ట్ హెయిర్‌తో ట్రెండీగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. న్యూ హెయిర్‌తో క్యూట్ లుక్స్‌తో నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.