మెగా డాటర్ నిహారిక నటించిన సినిమా ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. మార్చి 19న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి యమధర్మరాజుగా కనిపించనున్నాడు. నిహారిక యువరాణిగా కనిపిస్తోంది. నిహారిక వివాహం తర్వాత వస్తున్న తొలి చిత్రం. అరుముగ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 2018లో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. కామెడీ జోనర్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగులో అపోలో ప్రొడక్షన్స్ అందిస్తోంది.