Bench Life OTT release:
నిహారిక కొణిదెల తన తొలి ప్రొడక్షన్ అయిన కమిటీ కుర్రోళ్ళు తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అప్పుడే మళ్ళీ Bench Life అనే కొత్త వెబ్ సిరీస్ తో తిరిగి వచ్చారు. మానస శర్మ అనే కొత్త దర్శకురాలు రూపొందించిన ఈ 5 ఎపిసోడ్ సిరీస్ ప్రస్తుతం సోని లివ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
వైభవ్, రితికా సింగ్, చరణ్ పేరి ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. బెంచ్ లైఫ్ కథ హైదరాబాద్ లో బాలు (వైభవ్), మీనాక్షి (రితికా సింగ్), రవి (చరణ్ పేరి) అనే ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల చుట్టూ తిరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ముగ్గురూ కంపెనీ బెంచ్ పై ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు మేనేజర్ ఈషా (ఆకాంక్ష సింగ్) కి కొత్తగా జాయిన్ అయిన ప్రసాద్ వాసిష్ట (రాజేంద్ర ప్రసాద్) అంటే అసలు పడదు. అసలు ఈ ముగ్గురు బెంచ్ పై ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఈషా ప్రసాద్ ల మధ్య గొడవ ఏంటి? చివరికి వీళ్ళ కథ ఏమైంది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే యువతకు ఈ వెబ్ సిరీస్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. రితికా సింగ్ పాత్ర చాలా మందికి నచ్చుతుంది. వైభవ్ సీన్స్ కొన్ని మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. చరణ్ పేరి కూడా మంచి కమెడీ అందించారు. రాజేంద్ర ప్రసాద్ నటన కూడా ఈ సిరీస్ కి పెద్ద ప్లస్ పాయింట్. మధ్యలో కొన్ని ఎపిసోడ్లు కొంచెం నెమ్మదిగా సాగడం వల్ల ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోయే అవకాశముంది. ఇదే ఈ సిరీస్ కి పెద్ద మైనస్ పాయింట్.
Read More: Bigg Boss 8 Telugu ఇంట్లో ఉన్న రష్మిక మందన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?!
దర్శకురాలు మానస శర్మ మంచి కథను ఎంపిక చేసుకుని బాగానే తీర్చిదిద్దారు. దనుశ్ భాస్కర్ సినిమాటోగ్రఫీ, పీకే దాండి మ్యూజిక్ కూడా బాగున్నాయి. మొత్తానికి, బెంచ్ లైఫ్ కొంచెం స్లోగా సాగే ఒక మంచి కామెడీ డ్రామా. హీరోయిన్ గా స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి పక్కన పెట్టేస్తే.. నిర్మాతగా మాత్రం నిహారిక మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పుకోవచ్చు.