మెగా డాటర్ నిహారిక పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే నాగబాబు చెప్పిన వ్యాఖ్యలు ఇందుకు ఓ కారణం. ఇక ఈ బ్యూటీ నిన్న ఈ విషయం పై తన పోస్ట్ లో ఓ హింట్ ఇచ్చింది. కప్‌పై ఉన్న మిస్ నిహా పేరులో మిస్‌ని కట్ చేసి మిస్సెస్ అని రాసింది. అందులో Mrs అనే పదం చివర క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది. కాసేపటికి తనకి కాబోయే భర్తని హగ్ చేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే అతను ఎవరు అనేది మాత్రం తెలుపలేదు. నిహారిక పోస్ట్ చేసిన ఆ ఫొటోలో మెగా డాటర్ వరుడు వెనక్కి తిరిగి ఉండటం తో అతను ఎవరు అనేది తెలియలేదు. ఇక ఈ రోజు అభిమానులు ఊహించినట్లుగానే మరో పోస్ట్ తో తనకు కాబోయే భర్త ఫోటోను అఫీషియల్ గా రిలీజ్ చేసింది నిహారిక. అయితే అతని ఫొటో నిన్నటి నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు వెంకట చైతన్య. ఇక ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండబోతుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.